హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన మనవడు దేవాన్షు వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తీరు పలువురిని ఆకర్షిస్తోంది.

తన తల్లి నారా బ్రాహ్మణి ట్విట్టర్ ఖాతా నుంచి తన మాటలుగా దేవాన్షు తన తాత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ప్రియమైన తాతయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అని దేవాన్షు చెప్పాడు. 

"తాతా! మీ ప్రేమను పొందడం గొప్ప విషయం. మీరు నాకు ఓ ఐకాన్, స్ఫూర్తి.. అన్నిటికన్నా మించి మీరు నా బెస్ట్ ఫ్రెండ్" అని దేవాన్షు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.