సొంత మనవరాలిపై ఓ తాత కన్నేశాడు. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాల్సిన మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాత చేస్తున్న పనికి నిర్ఘాంతపోయిన మనవరాలు తప్పించుకోవడానికి ప్రయత్నించింది.  అహం దెబ్బతిన్న తాత... మనవరాలు మెడను విరిచేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేశాడు.. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...గిరిజన కాలనీకి చెందిన పోలయ్య, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం చేయగా.... 16ఏళ్ల వయసుగల రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. కాగా... వీరి ఇంటికి సమీపంలోనే మంగమ్మ తల్లిదండ్రులు నివసిస్తున్నారు.

కాగా... ఇటీవల మంగమ్మ ఇంట్లో లేని సమయంలో... అతని తండ్రి వెంకటేశ్వర్లు... ఇంట్లోకి ప్రవేశించి సొంత మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసి... ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేశాడు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందంటూ కథను అల్లి కుటుంబీకులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా... అది ఆత్మహత్య కాదు హత్య అని తేల్చారు. వెంకటేశ్వర్లును పోలీసులు తమదైన శైలిలో విచారించగా... తానే ఆత్మహత్య చేసి చంపినట్లు అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.