ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు అరుదైన గౌరవం దక్కింది. సచివాలయ ఉద్యోగులు ఆయనకు ఈ గౌరవాన్ని అందించనున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసిన కారణంగా ఈ గౌరవం లభించనుంది.

డిసెంబర్ 21న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంట్రామిరెడ్డి కీలక ప్రకటన చేశారు. 

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సుమారు 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం అసాధారణ విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అందుకే  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

ఆదివారం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. కాగా, ఏపీ సీఎం జగన్ 2019 అక్టోబర్ 2న రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.