ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాష్ట్ర పాలనలో తన ముద్రను వేసేలా కీలకాధికారుల బదిలీలు జరిగాయి. ఇన్‌చార్జ్‌ డీజీపీగా గౌతం సవాంగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా గౌతం సవాంగ్‌కు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నేటి మధ్యాహ్నం 12:15 గంటలకు  సవాంగ్ నేడు ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.