సీపీఎస్‌కు సంబంధించి ఏపీ మంత్రులతో ఉద్యోగులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపు యథావిధిగా సీఎం నివాసాన్ని ముట్టిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 

సీపీఎస్‌కు సంబంధించి ఏపీ మంత్రులతో ఉద్యోగుల భేటీ ముగిసింది. అనంతరం ఉద్యోగ నేతలు మాట్లాడుతూ.. సీఎం ఇంటి కార్యక్రమం యధావిధిగా నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. చాలా ఆశతో చర్చలకు వచ్చామని.. కానీ ప్రభుత్వం మాత్రం జీపీఎస్‌పైనే చర్చించాలని చెప్పిందని వారు తెలిపారు. తామంతా ఓపీఎస్ విధానం కావాలని చెప్పామని వారు చెప్పారు. జీపీఎస్ విధానంలో అదనంగా బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారని.. జీపీఎస్ గురించి చర్చిద్దామంటే మమ్మల్ని ఎందుకు పిలవడమని వారు నిలదీశారు. సీపీఎస్ ఉద్యోగులు రోడ్డున పడ్డారని.. సెప్టెంబర్ 1న బ్లాడ్ డే జరిపి తీరుతామని వారు స్పష్టం చేశారు.