ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నేడు 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తొలిసారి ఆయన రాజ్ భవన్ లో పుట్టిన రోజు జరుపుకున్నారు. గిరిజన, దళిత చిన్నారుల మధ్య గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కేక్ కట్ చేశారు. 

గవర్నర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి, కనక దుర్గమ్మ ఆలయాల వేదపండితులు ఆశ్వీరదించారు. గవర్నర్ కేక్ కట్ చేసి చిన్నారులందరికీ నూతన వస్త్రాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. 

సీఎం జగన్‌ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున  రాష్ట్ర మంత్రులు మంత్రి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో ఆంధ్రా లయోలా కళాశాలలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటుతారు.