Asianet News TeluguAsianet News Telugu

వచ్చేది కొత్త ప్రభుత్వం.. మంత్రులకు అధికారుల షాక్

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. విజయం ఎవరికి దక్కుతుందా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల విడుదలకు మాత్రం  మే 23వ తేదీ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. 

government officials shock to ministers and MLA's in andhrapradesh
Author
Hyderabad, First Published Apr 16, 2019, 10:50 AM IST

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. విజయం ఎవరికి దక్కుతుందా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల విడుదలకు మాత్రం  మే 23వ తేదీ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి.  తమ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ గెలుపుపై రెట్టింపు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే.. మంత్రులు, ఎమ్మెలేలు తమకు కావాల్సిన పనులను సంబంధిత అధికారులకు పురమాయిస్తుంటే.. వారు చేయడం లేదట.
 పనులు చేయకపోగా.. మంత్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

పైగా.... వచ్చేది కొత్త ప్రభుత్వమని.. మే 23తో ఆ విషయం తేలిపోతోందని.. మీరు చెప్పిన పని చేయాల్సిన అవసరం తమకు లేదని అధికారులు పేర్కొనడం గమనార్హం. ఇంకొందరు సీఎం చంద్రబాబు విమర్శలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల తీరుతో.. మంత్రులకు దిమ్మతిరిగిపోయిందట. వెంటనే ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios