Guntur: నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధులు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించి మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
YSR Rythu Bharosa-PM Kisan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ నిధులను మంగళవారం నాడు లబ్ధిదారుల ఖాతాలో జమకానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధులు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించి మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ లో భాగంగా ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని పంపిణీ చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు తెనాలి చేరుకుని 10.35 గంటలకు ధనిక అగ్రహార మార్కెట్ యార్డు ఆవరణలోని బహిరంగ సభ వేదికకు వెళ్తారు.
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడతను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారని, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
కాగా, 2021-22లో రూ .44,539 కోట్ల ఎగుమతులతో ఆంధ్రప్రదేశ్ భారతదేశ వ్యవసాయ వ్యాపారంలో అగ్రగామిగా అవతరించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆక్వాకల్చర్, హార్టికల్చర్, డెయిరీ, పౌల్ట్రీ వంటి రంగాలలో గణనీయమైన సహకారంతో ఆంధ్రప్రదేశ్ భారతదేశ వ్యవసాయ వ్యాపారంలో ఒక ప్రధాన పోటీదారుగా స్థిరపడిందని తెలిపింది. మహమ్మారి సృష్టించిన అవాంతరాలు ఉన్నప్పటికీ, 2021-22 సంవత్సరానికి రాష్ట్ర వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతుల విలువ రూ .44,539 కోట్లు (5.95 బిలియన్ డాలర్లు), ఇది 5.95 శాతం గణనీయమైన వృద్ధి రేటును ప్రదర్శిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీనికితోడు వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రం చెప్పుకోదగ్గ మైలురాళ్లను సాధించిందని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కొబ్బరి, కోకో, టమోటా, మిరప సహా పలు పంటల ఉత్పత్తితో పాటు సముద్ర ఎగుమతుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. కోడిగుడ్లు, చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా, వరి, మొక్కజొన్న, మామిడి, తీపి నారింజ, జీడిమామిడి, పసుపు ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది.
10,788 వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు వ్యవసాయ, అనుబంధ సేవలకు వన్ స్టాప్ షాప్ లుగా పనిచేస్తున్నాయనీ, 58 వ్యవసాయ, ఉద్యాన పరిశోధన కేంద్రాలు, 373 కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, 124 గోదాములు, 247 చాంబర్లు, 4,587 ప్యాక్ హౌస్ లు, 5 ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ లు, 400 మార్కెట్ యార్డులు ఉన్నాయని పేర్కొంది. పంటల ఉత్పాదకతను పెంచడానికి సకాలంలో, అధిక నాణ్యతతో కూడిన ఇన్ పుట్స్, సేవలను అందించేందుకు రూపొందించిన వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని తెలిపింది.
