విజయవాడ: నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే మహేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పోలీసులు ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో విజయవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. ఓ మహిళ కారణంగానే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.

సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ పై  కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను గోవా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయమై విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. గోవాకు విజయవాడ పోలీసులు బయలుదేరారు. గోవాకు వెళ్లాల్సిన విమానం మిస్ కావడంతో విజయవాడ పోలీసులు హైద్రాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్నారు.

also read:బెజవాడలో మహేష్ హత్య కేసులో ట్విస్ట్: కారు రివర్స్ చేసి..

ఓ మహిళ విషయమై మహేష్ హత్య జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సాత్విక్ రెడ్డి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తెలిపారు.

ఈనెల 10వ తేదీ రాత్రి విజయవాడలో  కాల్పులు జరగడంతో  మహేష్ మరణించాడు. మహేష్ ను హత్య చేసిన తర్వాత ఇద్దరు నిందితులు గోవాకు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.