ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు తప్పుడు దారిలో ప్రయాణిస్తున్నారు. పోలీసులకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ పోలీసు అధికారి.. యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. 

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు తప్పుడు దారిలో ప్రయాణిస్తున్నారు. పోలీసులకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ పోలీసు అధికారి.. యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాల్లో చోటుచేసుకుంది. వివరాలు.. పామిడి మండలం జీఏ కొట్టాలకు చెందిన విజయకుమార్ నాయక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సరస్వతి తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో డిగ్రీ చదువుతోంది. 

ఆ సమయంలో పద్మావతి, విజయ్ కుమార్‌ల మధ్య ప్రేమాయణం సాగింది. అయితే గత కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం మనస్థాపం చెందిన సరస్వతి స్వగ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం చికిత్స పొందుతూ అనంతపురం ఆస్పత్రిలో మృతి చెందింది. తన ఆత్మహత్యకు ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ కారణమంటూ ఫిర్యాదు చేసి చనిపోయింది. దీంతో ప్రియురాలు ఆత్మహత్యతో ఎస్సై బండారం బయటపడింది.

అంతేకాకుండా గత ఏడాది ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ భారతి అనే యువతిని కూడా ప్రేమించి మోసం చేశాడు. దీంతో భారతి దిశా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు విజయ్ కుమార్‌కు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లికి అంగీకరించాడు. దీంతో వారి పెళ్లి జరిగింది. ఇక, తాజాగా విజయ్ కుమార్ మోసం చేశాడని సరస్వతి ఆత్మహత్యకు పాల్పడింది. 

మృతురాలు సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు. విజయ్ కూమార్ నాయక్ ను అదుపులో తీసుకుని విచ‌ర‌ణ చేప‌ట్టారు. తన కూతురు మృతికి కారణమైన విజయ్‌ కుమార్‌ను కఠినంగా శిక్షించాలని సరస్వత్రి తండ్రి తిరుపాల్ నాయక్ డిమాండ్ చేశారు. అతడికి ఉరి శిక్ష విధించాలని కోరారు.