Asianet News TeluguAsianet News Telugu

జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ: మతలబు ఏంటీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ శుక్రవారం నాడు సాయంత్రం కలవనున్నారు. వీరిద్దరి భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. వల్లభనేని వంశీపై ఇటీవలనే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారనే కేసు నమోదైంది.

Gannavaram MLA Vallbhaneni Vamshi To Be meet Ap Cm Ys Jagan
Author
Amaravati, First Published Oct 25, 2019, 4:25 PM IST


అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ శుక్రవారం నాడు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలవనున్నారు. ఇవాళ ఉదయమే వంశీ  మాజీ కేంద్ర మంత్రి  సుజనా చౌదరిని కూడ కలిశారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను  కలవాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత కల్గిస్తోంది. ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చారని  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. 

2014 ఎన్నికలకు ముందు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన సమయంలో ఆసక్తికర సంఘలన చోటు చేసుకొంది. దమ్ము సినిమా చూసి వస్తున్న వల్లభనేని వంశీ గన్నవరం వెళ్తుండగా విజయవాడ బెంజీ సెంటర్ లో వైఎస్ జగన్ ర్యాలీగా వస్తున్నారు. ఆ సమయంలో జగన్ ర్యాలీగా వస్తున్న సమయంలో వల్లభనేని వంశీ కారును పోలీసులు ముందుజాగ్రత్తగా నిలిపివేశారు.

దీంతో కారులో ఉన్న వల్లభనేని వంశీ కిందకు దిగారు. ఆ సమయంలో జగన్ వల్లభనేని వంశీని ఆప్యాయంగా కౌగిలించకొన్నారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ విషయమై వల్లభనేని వంశీ టీడీపీ చీప్ చంద్రబాబునాయుడుకు వివరణ ఇచ్చారు.

మంత్రి కొడాలినాని, వల్లభనేని వంశీలు మంచి మిత్రులు. కొడాలి నాని గతంలో టీడీపీలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నాడు. 2019 ఎన్నికలకు ముందు వంశీ జగన్ ను కలిశారని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ఆరోపించారు. 

Also Read:టీడీపీ నుంచి చాలా మంది వస్తారు: వంశీ భేటీపై సుజనా క్లారిటీ

శుక్రవారం నాడు బీజేపీ నేత చందు సాంబశివరావు ఇంట్లో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సమయంలో సుజనానను కలుసుకొనేందుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చారు. ఇంటి బయటే కారు వద్దే వంశీ సుజనా చౌదరి కోసం ఎదురు చూశాడు.

Also Read:బాబుకు షాక్..?: బీజేపీ ఎంపీతో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ

సుజనా చౌదవరి బయటకు రాగానే సుజనా చౌదరితో  వంశీ మాట్లాడారు. సుజనా కారులోనే వంశీ ఆయనతో వెళ్లారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వల్లభనేని వంశీ పార్టీ మారుతారని కొొంత కాలంగా ప్రచారం సాగుతోంది.పార్టీ మార్పు విషయమై వంశీ గురువారం నాడు స్పష్టత ఇచ్చారు.

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో నకిలీ ఇళ్లపట్టాలను ఇచ్చారనే పేరుతో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విషయమై వంశీ గురువారం నాడు వివరణ ఇచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసును పెట్టారని వంశీ వివరించారు.

వైసీపీ ప్రభుత్వం తనపై కేసును బనాయించిందన్నారు. తప్పుడు కేసు పెట్టిన రెవిన్యూ అధికారులపై కూడ చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ మోహన్ డిమాండ్ చేశారు.

"

Follow Us:
Download App:
  • android
  • ios