గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి..
తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో షాక్ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా చేస్తున్నట్టుగా గంజి చిరంజీవి ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో షాక్ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా చేస్తున్నట్టుగా గంజి చిరంజీవి ప్రకటించారు. టీడీపీలో కొందరు తనను మానసికంగా హత్య చేశారని ఆరోపించారు. బీసీ నేత అయినందునే తనను అవమానించారని చెప్పారు. మున్సిపల్ చైర్మన్‌గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పదవుల కోసం రాజీనామా చేయలేదని.. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకనే రాజీనామా చేశానని అన్నారు.
2019 ఎన్నికల్లో మంగళగిరి టికెట్ ఇస్తానని మోసం చేశారని గంజి చిరంజీవి ఆరోపించారు. మంగళగిరి టికెట్ ఇవ్వకపోవడంతో.. అధికార ప్రతినిధి పదవి ఇచ్చి నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారని అన్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.