చిత్తూరులో దారుణం... బీర్ బాటిళ్లతో దాడిచేసి టమాటా రైతును దోచుకున్న దుండగులు

టమాటా రైతుపై బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా దాడిచేసిన గంజాయి బ్యాచ్ నాలుగున్నర లక్షలు దోచుకుని పరారయ్యింది. 

Ganja batch brutally attacked Tomato farmer in Chittoor District AKP

చిత్తూరు :తాము ఎప్పుడూ నష్టపోతూనే వున్నా నలుగురి కడుపునింపే వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టరు అన్నదాతలు. అయితే ఇటీవల కొందరు రైతుల అదృష్టం బావుండి టమాటా ధర ఆకాశాన్నంటడంతో నాలుగు పైసలు కళ్లజూస్తున్నారు. ఇలా ఎప్పుడో ఒకసారి లాభపడే రైతులను చూసి కొందరు దుర్మార్గులు ఓర్వలేకపోతున్నారు. టమాటా పంటను దొంగిలించడం, రైతులపై దాడిచేసి పంటడబ్బులు దోచుకోవడం వంటివి చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. ఓ టమాటా రైతుపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి నాలుగున్నర లక్షలు దోచుకున్నారు. దుండగుల దాడిలో తీవ్రగాయాలపాలై రైతు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 

పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం... చిత్తూరు జిల్లాకు చెందిన రైతు లోక్ రాజు తాను పండించిన టమాటా పంటను పలమనేరు మార్కెట్ లో అమ్ముకుంటున్నాడు. టమాటా ధర అధికంగా వుండటంతో మంచి లాభాలను పొందుతున్నాడు. ఇలా రోజూ మాదిరగానే టమాటాలను మార్కెట్ లో అమ్మి డబ్బులు తీసుకుని ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పుంగనూరు నక్కబండ ప్రాంతంలో కొందరు యువకులు లోక్ రాజు బైక్ ను అడ్డుకున్నారు. బైక్ ఆపగానే ఒక్కసారిగా రైతుపై బీర్ బాటిళ్లతో దాడిచేసారు. దీంతో తీవ్ర రక్తస్రావమై రైతు కుప్పకూలిపోవడంతో అతడి వద్దగల 4 లక్షల 50వేల రూపాయలు దోచుకుని అక్కడినుండి పరారయ్యారు. 

Read More  కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా యువకుడి దారుణ హత్య

రోడ్డుపై గాయాలతో పడివున్న లోక్ రాజ్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రైతును పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీర్ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తల పగలడంతో పాటు శరీరంలో అనేకచోట్ల గాయాలయ్యాయి. సమయానికి హాస్పిటల్ కు తీసుకువచ్చి వైద్యం అందించడంతో అతడి ప్రాణాలు దక్కాయని డాక్టర్లు చెబుతున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన దుండగుల కోసం గాలిస్తున్నారు. దాడికి పాల్పడింది గ్యాంగ్ గంజాయి మత్తులో వున్నట్లు బాధితుడు చెబుతున్నాడు. వారు దోచుకున్న డబ్బులు తిరిగి తనకు దక్కేలా చూడాలని లోక్ రాజు పోలీసులను కోరుతున్నాడు. రైతుపై దాడిచేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. 

ఇటీవల టమాటా రేటు ఎవరూ ఊహించని విధంగా పెరిగింది. సహజంగా పది ఇరవై రూపాయలకు కిలో వుండే టమాటాలు ఇప్పుడు 100 నుండి 200 వందలకు కిలో లభిస్తోంది. దీంతో టమాటా రైతులు   భారీగా ఆదాయం పొందుతుండటంతో వారిపై దాడులు పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో టమాటా రైతులపై దాడి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అలా
 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios