Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో గ్యాంగ్ వార్... పుట్టినరోజు వేడుకలో కత్తులతో రౌడీగ్యాంగుల వీరంగం (వీడియో)

ఓ పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది.

gang war in vizag...rowdy sheeters fighting in birthday party
Author
Visakhapatnam, First Published Jun 27, 2020, 7:36 PM IST

విశాఖపట్నం: ఓ పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది. గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరంలో జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌ లో‌ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... సీతానగరం ఆర్‌హెచ్‌ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ పాల్గొన్నాడు. అదే వేడుకకి వడ్లపూడికి చెందిన రౌడీ షీటర్ గందవరపు తరుణ్ కూడా వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వీరి మధ్య పాత గొడవలు కూడా ఉండటంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిప్తె ఒకరు దాడులకు దిగారు. కత్తులతో రెండు వర్గాలు పరస్పరం దాడులకి ప్రయత్నించారు. 

ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ గొడవలో పాల్గొన్నవారందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  రిమాండ్‌కు తరలించారు.  

read more  విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ట్విస్ట్: సందీప్, పండూ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ

అయితే సబ్బవరం మండలంలో జరిగిన వివాదమే ఈ దాడులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. గాజువాక,పెదగంట్యాడ, సబ్బవరం మండలాల పరిధిలో  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, భూ తగాదాలు సెటిల్‌మెంట్లు చేయడం, కత్తులతో దాడులు చెయ్యడం మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్ అలవాటుగా చెబుతున్నారు. ఒక్క న్యూపోర్టు పోలీసు స్టేషన్లోనే 12  కేసులున్నట్లు సిఐ తెలిపారు. 

వీడియో

"

అలాగే వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్  బిటెక్ చదివి కూడా నేరాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు.  అతడు ఓ హత్య కేసులో ప్రధాన ముద్దాయి, అంతేకాకుండా స్తెబర్ నేరాలు చెయ్యడంలో దిట్ట అని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫేక్ కాల్స్ చేసి బెదిరించిన విషయంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయని  తెలిపారు. అలాగే తరుణ్‌పై ఐదు కేసులున్నట్లు సీఐ పేర్కొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios