Asianet News TeluguAsianet News Telugu

నరసరావుపేట: కోటీ ఇరవైలక్షలు ఎగ్గొట్టి... రాత్రికి రాత్రే రాజస్థానీ కుటుంబం పరార్ (వీడియో)

ఏకంగా కోటీ ఇరవై లక్షలు అప్పు ఎగ్గొట్టి రాత్రికి రాత్రే ఓ రాజస్థానీ కుటుంబం పరారయిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

Ganesh Idol Making Rajastani Family Escapes at Narasaraopet
Author
Guntur, First Published Sep 16, 2021, 1:50 PM IST

గుంటూరు: ఉత్తరాదినుండి వ్యాపారం చేసుకోడానికి వచ్చిన ఓ కుటుంబం కొన్నేళ్ళుగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నివాసముంటోంది. స్థానికంగా మంచి పరిచయాలు పెంచుకున్న సదరు కుటుంబం వ్యాపార కోసమంటూ భారీగా అప్పులు తీసుకున్నారు. తాజాగా అప్పులన్నీ ఎగ్గొట్టి రాత్రికి రాత్రి పరారయ్యారు. దీంతో వారికి అప్పిచ్చినవారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ కు చెందిన ఓ కుటుంబం గుంటూరు జిల్లా నరసరావుపేటలో రావిపాడు రోడ్ లో సీజనల్ గా గణపతి విగ్రహాలు, ఆ తర్వాత వేరే విగ్రహాలను కూడా తయారుచేసి అమ్ముతుంటుంది. గత ఐదేళ్లుగా వీరు ఇక్కడే వుంటూ వ్యాపారం చేస్తుండటంతో పట్టణంలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో వ్యాపారంలో పెట్టుబడి కోసమంటూ స్థానికుల వద్ద దాదాపు కోటీ ఇరవైలక్షలు అప్పుచేశారు.  

వీడియో

అయితే ఈ కుటుంబం భారీగా గణపతి విగ్రహాలను తయారుచేసినప్పటికి అవి అమ్ముడుపోలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. దీంతో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలను అక్కడే వదిలిపెట్టి రాత్రికి రాత్రే కుటుంబం పరారయ్యింది. ఈ విషయం తెలిసి వారికి అప్పిచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. 

ఈ రాజస్థాని కుటుంబం చేతిలో మోసపోయిన వారంతా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసలు పరారయిన కుటుంబం కోసం గాలిస్తున్నారు. వారు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి వుంటారని భావిస్తున్న పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios