కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సాధించిన విజయంపై కర్ణాటక మాజీ మంత్రి, బిజెపి నేత గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. జగన్  విజయం సాధిచండం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ ఆశయాలను జగన్‌ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.చరిత్రలో జగన్‌ గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోవాలని ఆయన ఆశించారు. 

కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో రాఘవేంద్రస్వామికి మొక్కులు తీర్చుకున్నానని ఆయన చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడనే విషయం తెలిసిందే.