నెల్లూరు జిల్లా మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు 

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా... ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.