కృష్ణానదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 22, Aug 2018, 10:54 AM IST
four students go missing in krishna river
Highlights

గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోని గుండమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు బుధవారం నాడు ఉదయం గల్లంతయ్యారు.

అమరావతి: గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోని గుండమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు బుధవారం నాడు ఉదయం గల్లంతయ్యారు.

గుండిమెడ క్వారీ వద్ద  కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది.  దీంతో  ఈ వరదలో విద్యార్థులు కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే  స్థానికులు, అధికారులు  వరదలో కొట్టుకుపోయిన  విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదిలో  వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వరద ప్రవాహన్ని తక్కువ అంచనా వేయడంతో విద్యార్థులు గల్లంతయ్యారని అనుమానిస్తున్నారు.
 

loader