రాజమండ్రి:  తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

జిల్లాలోని అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో  సంగిశెట్టి కృష్ణవేణి, పావని, నిషాన్, రితికలు  ఆత్మహత్య చేసుకొన్నారు. తల్లీ ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
భర్త నాగేంద్రకుమార్ రెండో పెళ్లి చేసుకొన్నాడని మనోవేదనకు గురైన భార్య కృష్ణవేణి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకొందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.