శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో - ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో - ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బత్తలపల్లి మండలం పొట్లమర్రి దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.