కడప: ఎంపీ సీఎం రమేష్‌పై టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్‌ ఓ పొలిటికల్ బ్రోకర్ అంటూ పరుషమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

శుక్రవారం నాడు ఆయన  మీడియాలో మాట్లాడారు. సీఎం రమేష్ ఎన్ని ఆగడాలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. తన ప్రయోజనాల కోసమే సీఎం రమేష్ పార్టీ మారారని  ఆయన విమర్శించారు.

కడప జిల్లాలో టీడీపీ దారుణంగా ఓటమి పాలు కావడానికి సీఎం రమేష్ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు రాజకీయ బ్రోకర్లను తన వెంట పెట్టుకోవడం వల్లే టీడీపీ దారుణంగా ఓటమి పాలైందని ఆయన ఆరోపించారు.