విశాఖపట్టణం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి గుండెపోటుతో శుక్రవారం నాడు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

ప్రతిభాభారతి తండ్రి పున్నయ్య అస్వస్థతకు గురికావడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.ఆసుపత్రిలో ఉన్న తండ్రిని పరామర్శించేందుకు వచ్చిన ప్రతిభా భారతికి  గుండెపోటు వచ్చింది.

వెంటనే ఆమెను  అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.