అమరావతి:  రాజకీయ అనుభవం లేకున్నా తనకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని ఏపీ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ చెప్పారు.

గురువారం నాడు మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మంత్రిగా ఆరు మాసాల పాటు పనిచేసినట్టుగా ఆయన తెలిపారు. మూడు మాసాల పాటు  మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు మూడు మాసాలు ప్రజా సమస్యలపై పోరాటం చేసినట్టు ఆయన తెలిపారు.

తాను మంత్రిగా ఉన్న కాలంలో  ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినట్టుగా ఆయన  గుర్తు చేశారు. తనను సీఎం ప్రోత్సహించారని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేసినట్టుగా ఆయన తెలిపారు.

లోకేష్ కూడ తనను స్వంత తమ్ముడిగా చూసుకొన్నారని ఆయన చెప్పారు. చట్టసభల్లో తాను సభ్యుడిగా లేనందున  మంత్రి పదవికి రాజీనామా చేశామన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

సంబంధిత వార్తలు

మంత్రి పదవికి రాజీనామా చేసిన కిడారి శ్రవణ్