సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ నుండి  మాజీ మంత్రి   బాలినేని శ్రీనివాస్ రెడ్డికి  పిలుపు వచ్చింది.  

అమరావతి: మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డికి  ఏపీ సీఎం వైఎస్ జగన్ నుండి పిలుపు వచ్చింది.  రేపు  మధ్యాహ్నం  మూడు గంటలకు  సీఎం  జగన్ తో  భేటీ కానున్నారు.  పార్టీలో  చోటు  చేసుకున్న పరిణామాలపై  మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  అసంతృప్తిని వ్యక్తం  చేశారు. తాను  టిక్కెట్లు  ఇప్పించిన  వారే  తనపై  పార్టీ  నాయకత్వానికి  ఫిర్యాదులు  చేస్తున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు.  

ఈ  నెల  2వ తేదీన  ఏపీ సీఎం  వైఎస్ జగన్  తో  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  భేటీ అయ్యారు.  వైఎస్ఆర్‌సీపీ  రీజినల్ కో ఆర్డినేటర్  పదవికి  బాలినేని  శ్రీనివాస్ రెడ్డి  గత  మాసంలో  రాజీనామా సమర్పించారు. ఈ విషయమై   సీఎం జగన్ తో  బాలినేని  శ్రీనివాస్ రెడ్డితో  జగన్ చర్చించారు.  ఈ నెల  2వ తేదీన  తాడేపల్లిలో  జగన్ తో  సుమారు గంట పాటు  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  చర్చించారు.  ఈ సమావేశం తర్వాత  బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.  అయితే  సీఎంతో  భేటీ ముగిసిన  మూడు  రోజుల తర్వాత  ఒంగోలులో  మీడియా సమావేశం  ఏర్పాటు  చేసి   భావోద్వేగానికి గురయ్యారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.   పార్టీలో  చోటు  చేసుకున్న పరిణామాలపై  ఆయన  అసంతృప్తి వ్యక్తం  చేశారు.  తన నియోజకవర్గానికి  సమయం కేటాయించడానికి సమయం లేనందునే  రీజినల్ కోఆర్డినేటర్  పదవికి రాజీనామా  సమర్పించినట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. 

also read:కార్యకర్తలకోసం ఎవరినైనా ఎదిరిస్తా: బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలనం

అయితే  సీఎం   వైఎస్ జగన్  నుండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి  పిలుపు వచ్చింది.  దీంతో  రేపు  మధ్యాహ్నం మూడు గంటలకు  సీఎం జగన్ తో  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  భేటీ కానున్నారు.