మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది. సీఎం జగన్‌కు బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలను ఆయన పలు సందర్భాల్లో ఖండించారు. అయితే పార్టీ కో-ఆర్డినేటర్ పదవి ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవ్వడం, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యవహారాలను తనకు వదిలేయాలని పదే పదే అడిగినా సీఎం జగన్ ఒప్పుకోకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.
అయితే ఈ ప్రచారంపై బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ మారుతున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. తొలి నుంచి తాను వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. ప్రతిపక్షాలు మైంగ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారినే అడగాలని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలోనే పనిచేయనున్నట్టుగా తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవం అని మరోసారి స్పష్టం చేశారు.
