మెత్తబడ్డ బాలినేని శ్రీనివాస్ రెడ్డి: జగన్ తో భేటీ
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు ఏపీ సీఎం జగన్ తో క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్న బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి మూడు దఫాలు భేటీ అయ్యారు. దీంతో క్యాంప్ కార్యాలయంలో జగన్ తో శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
అమరావతి: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత మెత్తబడ్డారు. రెండు రోజుల వ్యవధిలో మూడు దఫాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy సమావేశమయ్యారు.బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించారు. ఇవాళ మధ్యాహ్నం సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగింపులతో Balineni Srinivasa Reddy కొంత మెత్తబడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం CM Camp కార్యాలయానికి చేరుకొని సీఎం YS Jagan తో భేటీ అయ్యారు.
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి Prakasm జిల్లాలో గత మంత్రివర్గంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ఉన్నారు. అయితే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారు. ఆదిమూలపు సురేష్ కు చోటు కల్పించారు. సామాజిక సమతుల్యత పాటించాల్సిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని పక్కన పెట్టాల్సి వచ్చిందని జగన్ తన దూతల ద్వారా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సమాచారం పంపారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి గౌరవం తగ్గకుండా ఉండేలా చూసుకొంటామని కూడా సీఎం జగన్ హామీ ఇచ్చారని సమాచారం.
అంతేకాదు ప్రోటోకాల్ కు ఇబ్బంది లేకుండా నామినేట్ పదవిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తుంది.ఈ విషయమై సీఎంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చించనున్నారు.గత కేబినెట్ లో ఉన్న కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులను కొనసాగిస్తుూ తనను ఎందుకు తప్పించారని కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పేరుతో తనను తప్పించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో తనకు మొండిచేయి ఇవ్వడంతో క్యాడర్ ఏ రకమైన సంకేతాలు ఇచ్చారని కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయాలపై సీఎం జగన్ తోనే చర్చించాలని సజ్జల రామకృష్ణారెడ్డి , గడికోట శ్రీకాంత్ రెడ్డి బాలినేనికి సూచించినట్టుగా సమాచారం. ఇదే సమయంలో సీఎం జగన్ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారని తెలిసింది.ఆ తర్వాత సీఎం జగన్ తో భేటీ కావడానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించారని తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తానని ప్రకటించారు.