మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  తన ప్రమేయం ఉంటే ఉరి తీయాలని  మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి  కోరారు.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉంటే ఉరి తీయాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కోరారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వైఎస్ విజయమ్మ చేసిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.డాక్టర్ సునీత న్యాయం కోరారంటే దోషులు ఎవరో ప్రజలకు అర్ధమైందన్నారు. రాజకీయ లబ్ది కోసమే విజయమ్మ లేఖ రాశారని ఆయన అభిప్రాయపడ్డారు. 

వివేకానందరెడ్డి హత్య విషయమై సీబీఐ విచారణను ఎందుకు కోరుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.2019 మార్చిలో తన ఇంట్లో ఉన్న వివేకానందరెడ్డిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.

ఈ హత్య జరిగి రెండేళ్లు దాటినా కూడ ఇంతవరకు నిందితులు ఎవరో గుర్తించకపోవడంపై వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 2వ తేదీన న్యూఢిల్లీలో ఆమె సీబీఐ అధికారులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు దాటినా కూడ దోషులను పట్టుకోకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.