జగన్ కు షాక్: వైసిపిలో చేరబోనన్న మాజీ డీజీపి

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 28, Aug 2018, 10:51 AM IST
Former DGP says he is not joining in YCP
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ను కలిసిన వెంటనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణంలో
పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ను కలిసిన వెంటనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

దీంతో జగన్, సాంబశివరావుల కలయికలపై రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదిలా ఉంటే అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడును మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు.  కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఇటీవలే ప్రతిపక్ష నేత జగన్ ను కలిసిన సాంబశివరావు వారం తిరగకముందే సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సీఎంతో భేటీ అయ్యారా లేదా వ్యక్తిగతంగా కలిశారా అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతుంది.   

loader