ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటం చాలా గొప్ప విషయమని శతృఘ్నసిన్హా పేర్కొన్నారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా దీనిని అమలు చేయాలంటూ ట్వీట్‌ చేశారు.

దేశంలో కరోనా విపరీతంగా పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ వైరస్ తాకిడి ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో.. వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వీలైన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో.. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా ప్రశంసలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటం చాలా గొప్ప విషయమని శతృఘ్నసిన్హా పేర్కొన్నారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా దీనిని అమలు చేయాలంటూ ట్వీట్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో కరోనా చికిత్సను ఉచితంగా అందిస్తున్నారని, ఇది సరైన సమయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు.

Scroll to load tweet…


నిజంగా ఇది అవసరమైన వారికి ఎంతో ఉపయోగపడే నిర్ణయమన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇతరులు కూడా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బాటను అనుసరిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona