తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అంతర్వది రథం దగ్థమైన ఘటనలో బృందం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు అధికారులు 20 శాంపిల్స్ సేకరించింది. ఘటనలో కుట్ర కోణం, మానవ తప్పిదం, ప్రమాదవశాత్తూ జరిగిందా అన్న అంశాలపై విచారణ సాగుతోంది.

విచారణకు సంబంధించిన వివరాలను అధికారులు  ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక అందించారు. శాంపిల్స్ ఆధారంగా నివేదిక సోమవారం రానుంది. మరోవైపు రథం దగ్ధమైన ఘటనలో ఏపీ రాజకీయాల్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి విపక్షాలు కూడా ధర్నాలు, ఛలో అంతర్వేది అలాగే ధర్మ పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో సీఎం జగన్ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. దీనిలో భాగంగానే ఫోరెన్సిక్ బృందం 20 శాంపిల్స్ సేకరించింది.

అంతర్వేది ఘటనపై విపక్షాలు నిరసనలకు సిద్ధమవటం సిగ్గుచేటన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. గుడికి భక్తితో వెళ్లాలని నిరసనలు తెలిపేందుకు కాదని ధ్వజమెత్తారు. అధికారంలో ఉంటే ఓ మాట.. లేకపోతే మరో మాట మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.