Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్ పాయిజిన్‌.. 51 మంది విద్యార్ధులకు అస్వస్థత, చట్నీలో బొద్దింక గుర్తింపు

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానాం ప్రభుత్వం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజిన్ అయ్యింది. 51 మంది వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. రంగంలోకి దిగిన వైద్యులు.. హాస్టల్‌కు చేరుకుని చికిత్స అందించారు.
 

food poisoning in bc hostel in anakapalle district
Author
First Published Sep 14, 2022, 5:21 PM IST

అనకాపల్లి జిల్లాలో ఫుడ్ పాయిజిన్ అయ్యింది. పరవాడ మండలం తానాం ప్రభుత్వం బీసీ బాలుర వసతి గృహంలో బుధవారం ఉదయం 8 అల్పాహారం తిన్నారు. ఆ తర్వాత కాసేపటికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులకు హాజరయ్యారు. అయితే వీరిలో 51 మందికి ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే హాస్టల్‌కి వచ్చేశారు. టీచర్ల ద్వారా సమాచారం అందుకున్న విద్యా శాఖ అధికారులు, వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన వైద్యులు.. హాస్టల్‌కు చేరుకుని చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లల పరిస్ధితి నిలకడగానే వున్నట్లుగా తెలుస్తోంది. అయితే పల్లీల చట్నీలో బొద్దింక పడిందని.. అది తినడం వల్లే బాలురు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios