Asianet News TeluguAsianet News Telugu

గుడ్డు, టమాటా రైస్ తిని.. 26మంది ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్.. ఏడుగురి పరిస్థితి విషమం..

గుడ్డు, టమారారైస్, పెరుగన్నం తిన్న 26మంది ఇంనీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన అనంతపురంలో కలకలం రేపింది. 

Food poisoning, 26 engineering students sick in anantapur - bsb
Author
First Published May 31, 2023, 1:11 PM IST

అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ అయి పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మొత్తం 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మంగళవారం రాత్రి భోజనంలో విద్యార్థులు టమాటా రైస్, కోడిగుడ్డు, పెరుగన్నం తిన్నట్లుగా తెలిపారు. ఆ తర్వాత కాసేపటికి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వారిని అనంతపురంలోని అమరావతి ఆసుపత్రికి తరలించారు . 26 మందిలో ఏడుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. వీరికి ఐసియూలో చికిత్స అందిస్తున్నారు. వీరితోపాటు మరికొంతమంది విద్యార్థులు కూడా  స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. వీరిని హాస్టల్ దగ్గరే ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios