న్యూడిల్లీ: రాజ్యసభలో టీడీపీపీ బీజేపీలో విలీనం చెల్లదని చెల్లదంటూ రాజ్యసభ చైర్మెన్  వెంకయ్యనాయుడుకు  టీడీపీ ఎంపీలు శుక్రవారం నాడు లేఖ ఇవ్వనున్నారు.

రాజ్యసభలో నలుగురు ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని  గురువారం నాడు లేఖ ఇచ్చారు. 

రాజ్యసభలో  టీడీపీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే గంపగుత్తగా టీడీపీ ఎంపీలు  బీజేపీలో చేరలేదు.  ఈ విషయాన్ని  టీడీపీ ఎంపీలు  గుర్తు చేస్తున్నారు.

రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడం చెల్లదని  ఐదుగురు ఎంపీలు లేఖ ఇవ్వనున్నారు. లోక్‌సభలోని ముగ్గురు ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడులతో పాటు రాజ్యసభలో మిగిలిన ఇద్దరు ఎంపీలు తోట సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌లు  వెంకయ్యనాయుడును కలవనున్నారు.