ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: ఏపీ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు వేటు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలకు  అంతరాయం కల్గిస్తున్నందున సస్పెండ్ చేశారు. 

Five TDP MLAs Suspended From Till Assembly Session complete


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుండి TDP  ఎమ్మెల్యేలు సోమవారం నాడు సస్పెండ్ అయ్యారు.అసెంబ్లీ నుండి కింజారపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, రామానాయుడు, డోలా వీరాంజనేయులు, బుచ్చయ్య చౌదరిలను సభ నుండి సస్పెండ్ చేశారు.ఈ శాసన సభ పూర్తయ్యే వరకు సభ్యులను సస్పెండ్ చేశారు. 

ఇవాళ AP Assembly రెండోసారి వాయిదా పడి ప్రారంభమైన తర్వాత Jangareddy Gudem ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన  చేస్తుందని స్పీకర్ Tammineni Sitaram  ప్రకటించారు.  అయితే ఇవాళ సభలో ఈ విషయమై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని ఎజెండాలో తెలిపితే తాము చర్చకు పట్టుబడాల్సిన అవసరం లేదని టీడీపీ సభ్యుడు Payyavula Keshav చెప్పారు.

 అయితే సభ ప్రారంభం కాగానే జంగారెడ్డి గూడెం ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Alla Nani ప్రకటన చేస్తారని తెలిపారు. అయితే ఈ  ప్రకటన తర్వాత చర్చకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్ కోరారు.  అయితే చర్చ కావాలంటే టీడీపీ సభ్యులు మరో రూపంలో రావాలని ఏపీ మంత్రి Buggana Rajenath Reddy చెప్పారు. ఈ విషయం టీడీపీ సభ్యులకు కూడా తెలుసునన్నారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారన్నారు.

ఏపీ మంత్రి ఆళ్ల నాని జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రకటన చేస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మంత్రి ఆళ్ల నాని ప్రకటనను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఈ సమయంలో ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ను ప్రతిపాదిస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios