కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: నంద్యాలకు చెందిన ఐదుగురు మృతి, మరో 13 మందికి గాయాలు
కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
![Five Killed in Road accident in Karnataka lns Five Killed in Road accident in Karnataka lns](https://static-gi.asianetnews.com/images/01h27d8j6szasq9zz1fbgrys4q/road-accident-jpg_363x203xt.jpg)
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో మంగళవారంనాడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆగిఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా గుర్తించారు. కలబురిగిలోని దర్గా ఉర్సు జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను మునీర్, నయామత్ , రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మిగా గుర్తించారు.
దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, డ్రైవర్లకు సరిపోను నిద్రలేకపోవడం , రోడ్లు సరిగా లేకపోవడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా ప్రమాదాలు ఆగడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన ఈ నెల 5వ తేదీన జరిగింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ఈ నెల 4వ తేదీన ఏపీ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో టిప్పర్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వినాయకుడి గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ఈ నెల 12న తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పేర్లపాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. కారు,. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఏడాది మే 30వ తేదీన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణీకులు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.