Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో కరోనా దెబ్బ: ఐదు జంటలకే మ్యారేజీ

కరోనా ప్రభావంతో తిరుమల వెంకన్న సన్నిధిలో జరిగే పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. 

Five couple gets marriage from four months in tirumala
Author
Tirupati, First Published Aug 12, 2020, 5:10 PM IST

తిరుమల:కరోనా ప్రభావంతో తిరుమల వెంకన్న సన్నిధిలో జరిగే పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. 

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఈ ఏడాది జూన్ 11వ తేదీన భక్తులకు దర్శనాలను ప్రారంభించారు.

తిరుమలలో సాధారణ రోజుల్లో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరిగేవి. కానీ కరోనా నేపథ్యంలో తిరుమలలో పెళ్లిళ్లు నిలిచిపోయాయి. మార్చి మాసంలో ఒక్క పెళ్లి మాత్రమే జరిగింది.

శ్రావణ మాసంలో సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ పెళ్లిళ్లు జరిగేవి. కానీ, ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు మాత్రం జరగడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ముందుగానే నాలుగు పెళ్లిళ్ల కోసం బుక్ చేసుకొన్నారు. కరోనా కేసుల దృష్ట్యా  ఈ పెళ్లిళ్లను రద్దు చేశారు.

కరోనా నేపథ్యంలో తిరుమలలో పెళ్లిళ్లు జరుపుకోవాలంటే పెళ్లి పత్రికతో పాటు ఐసీఎంఆర్ నిర్ధేశించిన కోవిడ్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయించుకొని సర్టిపికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం 20 మంది బంధు మిత్రులు మాత్రమే పెళ్లికి హాజరు కావాల్సి ఉంటుంది.

also read:అన్నవరం ఆలయంలో 39 మందికి కరోనా: ఈ నెల 23 వరకు భక్తులకు దర్శనాలు రద్దు

అయితే మార్చి నుండి ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో తిరుమలలో 926 పెళ్లిళ్లు జరిగాయి. కరోనా దెబ్బకు తిరుమలలో పెళ్లిళ్లు చేయించుకొనేందుకు ఎవరూ రావడం లేదు.

also read:కరోనా దెబ్బ: తిరుమల వెంకన్నకు తగ్గిన ఆదాయం

దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకొనేందుకు ప్రతి ఏటా వచ్చేవారు.కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు ఇక్కడ చేసుకొనేందుకు వచ్చే అవకాశాలు కూడ లేకుండాపోయాయి.ఇక్కడ పెళ్లిళ్లు జరిగితే కొన్నివ్యాపారాలు సాగేవి. పెళ్లిళ్లు నిలిచిపోవడంతో ఆ వ్యాపారులకు కూడ ఇబ్బందిగా మారింది. 

కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రతి రోజూ తిరుమలలో  12 వేల మంది భక్తులకు వెంకన్న దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో కూడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టీటీడీలో పనిచేసే 743 మందికి కరోనా సోకిందని టీటీడీ ఈశో అనిల్ సింఘాల్ ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios