హరిజన మత్స్యకారుల సహకార సంఘం ఎన్నికను అడ్డుకుంటూ ఆ సొసైటీ సభ్యులు ఆందోళనకు దిగారు.
మచిలీపట్నం : కృష్ఱా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పమిడిముక్కల మండలం మేడూరులోని హరిజన ఫిషర్ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు అధికారులు సిద్దమయ్యారు. షెడ్యూల్ ప్రకారం సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎఫ్డిఓ రికిత ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
హరిజన మత్స్యకారుల సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని... వాటిపై ఇప్పటికే చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న తర్వాతే ఎన్నికల నిర్వహించాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో మేడూరలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు ఆపడం కుదరదని ఎన్నికల అధికారి చెబుతున్నారు.
వీడియో
సొసైటీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తుల ధర్నా చేపట్టారు. దీంతో సొసైటీ భవనం ముందు ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహించాలంటూ గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ధర్నాకు దిగిన గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు.
