Asianet News TeluguAsianet News Telugu

గోదావరికి పోటెత్తుతున్న వరద… ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 

first flood warning issued in godavari at dowleswaram dam
Author
Rajahmundry, First Published Sep 10, 2021, 3:42 PM IST

గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు అవుట్ ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉంది. దీంతో విపత్తుల శాఖ కమిషనర్ కె . కన్నబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

ALso Read:బంగాళాఖాతంలో అల్పపీడనం... మూడురోజుల్లో తెలంగాణకు తిరిగిరానున్న భారీ వర్షాలు

మరోవైపు బ్యారేజీ నుండి 9,11,838 క్యూసెక్కులు మిగులు జలాలను అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్లా కాలువలకు 10,200 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లోని భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతోంది. ఇక రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరికొంత పెరిగి తరువాత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios