విజయవాడ: ఇంద్రకీలాద్రి పై అగ్ని ప్రమాదం తప్పింది. దేవాలయ పోటులోని పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ లీకయ్యింది. ఈ లీకును వెంటనే గుర్తించిన అధికారులు వాల్వు ను కట్టేసి గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. లీకేజీ ఎక్కడ జరిగిందో వెతికిపట్టుకొని ఆ పైప్ లైనుకు మరమ్మతులు చేస్తున్నారు. 

ఇంతటి పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొన్ననే ఒక కార్మికుడు పైనుంచి కిందపడి మరణించడం, ఆ తరువాత ఆ రక్తపు మరకలను కడుగకుండా ఆలయ అధికారులు కేవలం ఇసుకతో కప్పిఉంచడం భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన విషయం తెలిసిందే.