అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో  ఈ ప్రమాదం జరిగిందనే  ప్రచారం సాగింది.

కాకినాడ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తూర్పుపాలెం ఓఎన్‌జీసీ వద్ద గ్యాస్ తో పాటు క్రూడాయిల్ కూడ లీకైంది. దీంతో మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగుతాయనే భయంతో స్థానికులు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. గంటల వ్యవధిలోనే నాలుగు ఫైరింజన్లతో మంటలను అధికారులు అదుపులోకి తీసుకువచ్చారు. స్థానిక ప్రజలు ఇబ్బందిపడొద్దని ఓఎన్‌జీసీ అధికారులు కోరుతున్నారు.

గతంలో ఓఎన్‌జీసీలో ఇదే తరహలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే చిన్న చిన్న ప్రమాదాలను రోజుల వ్యవధిలోనే ఓఎన్‌జీసీ అధికారులు ఆర్పివేశారు.ఓఎన్‌జీసీ నుండి గ్యాస్ లీకై మంటలు చెలరేగిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైపులైన్ లీకై మంటలు వ్యాపించాయి.

ఈ విషయమై స్థానికులు ఓఎన్‌జీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 2021 ఏప్రిల్ మాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2020 జూలై 10వ తేదీన లో తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్‌జీసీలో ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.2020 మే 18వ తేదీన ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ నుండి లీకైంది. మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద గ్యాస్ లీకైంది.