Asianet News TeluguAsianet News Telugu

విశాఖ స్టిల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం....కోట్లలో ఆస్తినష్టం

విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ వరుస అగ్నిప్రమాదాలతో వణికిపోతోంది. ఇవాళ ఉదయం ఎస్ఎంఎస్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగి, క్షణాల్లో అక్కడి పంప్ హౌస్ దగ్ధమైంది.

fire accident in vizag steel plant
Author
Visakhapatnam, First Published Jan 21, 2019, 10:25 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ వరుస అగ్నిప్రమాదాలతో వణికిపోతోంది. ఇవాళ ఉదయం ఎస్ఎంఎస్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగి, క్షణాల్లో అక్కడి పంప్ హౌస్ దగ్ధమైంది.

ఫ్లాంట్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పాటు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. కన్వేయర్ పూర్తిగా దగ్ధమవ్వడంతో కోట్లలో ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.

మరోవైపు రెండ్రోజుల క్రితం ఫ్లాంట్‌లోని ఫర్నేస్-3లో ఉన్న బ్లోపైప్ పేలిపోవడంతో భారీ ఆస్తినష్టం చోటు చేసుకుంది. మరోవైపు వరుస ప్రమాదాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios