విశాఖ: విశాఖపట్టణంలోని హార్బర్‌లోని టగ్ లో సోమవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ  ప్రమాదం జరిగిన సమయంలో  టగ్‌లో 29 మంది సిబ్బంది ఉన్నారు.అగ్ని ప్రమాదం వల్ల సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. అయితే  ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.ఓడల నుంచి సరుకులను తెచ్చేందుకు జాగ్వర్ టగ్  తీసుకొచ్చారు.ఆ సమయంలో 20 మంది అక్కడే ఉన్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు బోట్లను రంగంలోకి తీసుకెళ్లారు. 

కోస్టల్ నౌక జాగ్వర్ టగ్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో 29 మంది ఉన్నారు. 16 మంది గాయపడ్డారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్ నౌక రాణి రష్మోజీ నౌకను రంగంలోకి దించారు.

మంటలు చుట్టుముట్టడంతో జాగ్వర్ టగ్ లో ఉన్న వారు సముద్రంలోకి దూకి ప్రాణాలను రక్షించుకొనే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బోట్లు, హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను రక్షించారు.

ప్రాణాలను రక్షించుకొనేందుకు సముద్రంలోకి దూకిన ఓ వ్యక్తి గల్తంతయ్యాడు. అతడి కోసం  గాలింపు చర్యలు చేపట్టారు.