బెజవాడ వాంబే కాలనీలో రైల్వేస్‌కి కేటాయించిన స్థలంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ప్రదేశం కావడం.. పైగా ఎండిపోయిన గడ్డి వుండటంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి.
విజయవాడ (vijayawada) వాంబే కాలనీ (Vambay Colony) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. రైల్వేస్‌కి (indian railways) కేటాయించిన స్థలంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. ఆ స్థలం మొత్తం పది ఎకరాలు వుంటుందని అంచనా. ఎండిపోయిన గడ్డి వుండటంతో మంటలు తీవ్రంగా చెలరేగుతున్నాయి. అయితే ఇది ఎవరైనా కావాలని పెట్టారా.. ప్రమాదవశాత్తూ జరిగిందా అన్నది తెలియరాలేదు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మంటలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. ఒక్క ఫైరింజన్ మాత్రమే రావడంతో మంటలు అదుపులోకి రాలేదు. విజయవాడలో ఇవాళ ఇది రెండో అగ్నిప్రమాదం. ఉదయం ముత్యాలమ్మ అమ్మవారి గుడి వద్ద కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
