గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని వరవకుంటలోని వాసు టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే డిపో మొత్తాన్ని అగ్నికీలలు కమ్మేశాయి.

వెదురు నిల్వలు పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 4 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.