కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున  భారీ అగ్నిప్రమాదం జరిగింది.  షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మూడంతస్తులకు వ్యాపించినట్టుగా అనుమానిస్తున్నారు.ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.

పెద్దాపురం, పిఠాపురం నుండి నాలుగు అగ్నిమాపక వాహనాలను తెప్పించి  మంటలను ఆర్పుతున్నారు. ఈ భవనం నుండి చుట్టుపక్కలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. 

సూపర్ మార్కెట్ లో ప్లాస్టిక్ వస్తువులు, స్కూల్ బ్యాగులు, దుస్తులు ఎక్కువగా ఉన్న కారణంగా మంటల తీవ్రత పెరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.