విశాఖపట్నం: షాట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. దాదాపు పది లక్షలకు పైగా ఆస్తినష్టం జరగడమే కాకుండా బాధిత కుటుంబానినికి నిలువ నీడ లేకుండా పోయింది. ఈ దుర్ఘటన విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. భీమిలి పట్టణంలోని ఎగువ పేటలోని ఓ పెంకుటింట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. అవి అంతకంతకు వ్యాపించి ఇళ్లు మొత్తాన్ని కాల్చి బూడిద చేశాయి. 

ఈ అగ్నిప్రమాదం ఎలాంటి ప్రాణనష్టాన్ని కలిగించకున్నా భారీ ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు పదిలక్షల ఆస్తి నష్టం జరిగినట్లు....నగదు, నగలు, సామాన్లు కాలి బూడిదైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా కుటుంబం కట్టు బట్టలతో మిగిలింది.

వీడియో