చిత్తూరు జిల్లా రొంపిచర్లలో ఫ్లెక్సీల విషయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని అదుపు చేస్తున్నారు

చిత్తూరు జిల్లా రొంపిచర్లలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీల విషయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లు, బీర్ బాటిళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని అదుపు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇరుపార్టీల కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred