ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ, కోస్తా న్యాయవాదుల మధ్య వివాదం తలెత్తింది

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయలసీమ, కోస్తా న్యాయవాదుల మధ్య వివాదం తలెత్తింది. మీటింగ్ నిర్వహించే విషయమై ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ క్రమంలో బార్‌ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్ తలపై కుర్చీ తగలడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. జరిగిన ఘటనపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు వివరించాలని గాయపడిన న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.