Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో కల్లోలం: విద్యార్ధులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ,1,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 
fee reimbursement release in andhra pradesh says cm ys jaganmohan reddy
Author
Amaravathi, First Published Apr 14, 2020, 3:47 PM IST
కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ,1,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

అంతేకాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించామని జగన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో  కాన్ఫరెన్స్‌లో జగన్ వెల్లడించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా విద్యారంగానికి సంబంధించిన పలు కీలక విషయాలను సీఎం అధికారులతో  ప్రస్తావించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధుల తల్లి ఖాతాలోకే ఫీజు రియింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లిస్తామని జగన్ పేర్కొన్నారు.

గతంలో ఇంజనీరింగ్ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ప్రభుత్వం రూ.35 వేలు మాత్రమే ఇచ్చేదని, మిగిలిన డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.

కానీ ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని చెప్పారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్ధుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.

దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, వాటిని సక్రమంగా అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌లిస్టులో పెడతామని విద్యాశాఖ అధికారులు జగన్‌కు వెల్లడించారు. 
Follow Us:
Download App:
  • android
  • ios