చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలకు రెండేళ్ల చిన్నారి బలైంది. కుటుంబంలో తరచూ గొడవలు అవుతున్నాయని ఓ వ్యక్తి మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.

 కాగా... తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన రెండేళ్ల కుమార్తెకు కూడా విషం తాగించడం గమనార్హం. దీంతో చిన్నారి కూడా కన్నుమూసింది. రెండుళ్లు కూడా నిండని పసిదానికి అర్థాంతరంగా నూరేళ్లు నిండిపోయాయంటూ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విష ప్రభావంతో చిన్నారి అక్కడికక్కడే కన్నమూయగా... ఆమె తండ్రి మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

ప్రాణాలో కొట్టుమిట్టాడుతున్న అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామాపురంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.